తుఫాను నేపథ్యంలో మన్యం జిల్లా అధికారులందరూ అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఉత్తరాంధ్రలో తుఫాను మూలంగా గురువారం నుంచి జిల్లాలో ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు జిల్లా, మండల అధికారులు అప్రమత్తం కావాలని తెలిపారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.