భోగాపురం విమానాశ్రయం 40 శాతం పనులు పూర్తి: కేంద్ర మంత్రి

59பார்த்தது
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తి అయ్యాయని, విమానాశ్రయ నిర్మాణాన్ని 6 నెలల ముందే పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. 2026 జూన్ నాటికి విమానాశ్రయాన్ని పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి చెప్పారు.

தொடர்புடைய செய்தி