బొబ్బిలికి చెందిన న్యాయవాది సామాజిక కార్యకర్త తుమరాడ గంగాధర్ ను ఆంధ్రా లాయర్స్ అషోషియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ ఆర్ సంకు, అధ్యక్షులు ఎమ్ వి రాజారాం సిఫార్సుల మేరకు ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనువాస్ గారు సంభందిత వాట్సాప్ గ్రూప్ వేదికగా నియామక ప్రకటణను విడుదల చేశారు, ఈ సంధర్భంగా గంగాధర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో స్వతంత్ర వ్యవస్థగా కొనసాగుతున్నటువంటి న్యాయ వ్యవస్థలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న న్యాయవాదులు యొక్క వృత్తిపరమైన రక్షణ ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి న్యాయవాదుల భద్రతా చట్టాన్ని రూపొందించే దిశలో కృషి చేయుట కొరకు మరియు న్యాయవాదులు యొక్క సర్వతోముఖాభివృద్ధికి అన్ని విషయాల్లోనూ ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ పనిచేస్తుందని తెలిపారు, ఈ భాధ్యతను అందచేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనువాస్ కు గంగాధర్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.