విజయనగరం జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. అందులో భాగంగా గురువారం బొబ్బిలి పట్టణంలొని 13వ వార్డు గొల్లవీధిలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అందుతున్న సేవలు, వారి సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ చేపడుతున్నట్లు కమిషనర్ రామలక్ష్మి బుధవారం ప్రకటనలో తెలిపారు.