రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆదివారం బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన శ్రీ విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి మాజీ ఎమ్మెల్యే తింటు లక్ష్ముంనాయుడుతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనుపోత్సవాన్ని అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.