బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ వెల్నెస్ సెంటర్ సిబ్బంది అన్నపూర్ణ ఆపన్న హస్తం వృద్ధులకు వారి ఇళ్లకు వెళ్లి బిపి, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది ఎ.వేదప్రియ, సునీత, అన్నపూర్ణ ఆపన్న హస్తం నిర్వాహకులు లక్ష్మి శంకరరావులు పాల్గొన్నారు.