ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు విజయవాడ వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేసేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తిరిగి గురువారం ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చారు. జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వారితో కూర్చుని సరదాగా కాసేపు ముచ్చటించారు. విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు.