నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం వడ్డెపాలెం గ్రామంలో మూడు రోజులు జరిగే వినాయక చవితి వేడుకల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం కోలాట ప్రదర్శన జరిగింది. గతంలో కోలాటం నేర్చుకున్న గ్రామంలోని మహిళలు, చిన్నారులు కోలాటం వేశారు. ఈ కోలాట ప్రదర్శనను గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. సోమవారం ఉదయం వినాయకుడికి ప్రత్యేక పూజలు ఆనంతరం ఉట్టికొట్టుట కార్యక్రమం నిమజ్జనం జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు.