నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ఈ ప్రజా వేదికలో బయటపడ్డ అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎనిమిది కోట్లకు ఆడిట్ జరగగా 3 లక్షల 80 వేల 174 రూపాయలు అవకతవకలు జరిగినట్లు ప్రొసీడింగ్ అధికారి విజయలక్ష్మి వెల్లడించారు. పలు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు పనికి వెళ్లకపోయినా కొందరికి మస్టర్లు వేసినట్లు గుర్తించారు.