వాస్తు శాస్త్రం ప్రకారం ఇళ్లలో కొన్ని చెట్లను పెంచుకుంటే లాభాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇంటికి తూర్పు వైపున గంగరేగి, పనస చెట్లు పెంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. గంగరేగి చెట్టు వల్ల దిష్టి తగలదు. పనస చెట్టు వల్ల ఇంట్లో సంతాన భాగ్యం ఉంటుంది. ఇంటికి దక్షిన దిశలో చింత చెట్టు ఉంటే ఆహార ధాన్యాల కొరత ఏర్పడదు. పశ్చిమ వైపున కొబ్బరి చెట్టు పెంచుకుంటే శుభకార్యాలు నిర్వహించే స్తోమత కలుగుతుంది.