సూళ్లూరుపేట నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి కోరారు. సోమవారం శ్రీ సిటీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. సమస్యలపై వినతి పత్రం అందజేశారు.