సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు జరిగే భాజపా సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి కోరారు. శనివారం నాయుడుపేట పట్టణంలోని డీఎస్ ఆర్ కళ్యాణ మండపంలో తిరుపతి జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి పార్థసారథి, రాష్ట్ర అధికార ప్రతినిధులు సామంచి శ్రీనివాస్ భాను ప్రకాష్ రెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.