సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారి సత్రం మండలం లోని బూదూరులో నెలకొన్న భూ వివాదం పై స్థానిక తహసీల్దార్ శైలకుమారి మంగళవారం విచారణ చేపట్టారు. భూములు ఆక్రమణకు గురైన విషయంపై బాధితులు వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపి అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉప తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి, మండల సర్వేయర్ రామారావు, వీఆర్వో మురళి తదితరులు పాల్గొన్నారు.