దొరవారిసత్రంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాల, కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో ఉన్న వసతులను బుధవారం స్థానిక తహసీల్దార్ శైలకుమారి, ఎంఈవో కృష్ణయ్య తో కలిసి తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, భోజనశాల, వంట గదులు, తాగునీటి శుద్ధి ప్లాంట్లు పరిశీలించారు. ప్రిన్సిపల్ తిరుపతయ్య, ప్రత్యేక అధికారిణి పార్వతితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.