సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం హరిజనవాడ గుడి ప్రక్కనే నిబంధనలకు విరుద్ధంగా బుధవారం నూతన వైన్ షాప్ ను ప్రారంభించారు. దీంతో స్థానిక మహిళలు ఆ షాపు మూసివేశారు. వారు మాట్లాడుతూ. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే వైన్ షాపును వేరే చోటుకు తరలించాలన్నారు. లేకుంటే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.