సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం నందీశ్వరునికి ప్రదోష పూజలు అత్యంత వైభవంగా జరిగింది. వాల్మీకేశ్వర స్వామికి, నందీశ్వరునికి ఏకకాలంలో అభిషేకాలు పూజలు అలంకరణలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఈవో లతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.