సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు టౌన్ లో సిమెంట్ రోడ్డుకు మండల టీడీపీ అధ్యక్షులు ఎమ్. తిరుమలై రెడ్డి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పల్లె అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన పల్లె పండుగ వారోత్సవాలు ప్రతి గ్రామంలో దిగ్విజయంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఇటువంటి అభివృద్ధి పనులు చేయడం ఎన్డీయే కూటమికే సాధ్యమన్నారు.