తవణంపల్లె మండలంలో కురిసిన భారీ వర్షానికి అరగొండ - సరకల్లు మార్గంలోని తొడతర వద్ద బాహుదా నదిపై కల్వర్ట్ తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎమ్మెల్యే మురళీమోహన్ ఆదేశాల మేరకు ఘటన స్థలంలో చేరుకుని యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా రాకపోకలు జరిగేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్ అండ్ బి అధికారులను సంప్రదించి శాశ్వత పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే మంగళవారం తెలిపారు.