పిచ్చాటూరు మండలం, సిద్దిరాజుకండ్రిగ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి హనుమతేశ్వర దేవాలయంలో హనుమతేశ్వర స్వామివారికి మంగళవారం సాయంత్రం అభిషేకము ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నవీన్ స్వామి స్వామివారికి ధూపదీప నైవేద్యములను సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం స్వామి వారికి ప్రతికరమైన హనుమాన్ చాలీసాను 21 సార్లు పారాయణ చేశారు. కార్యక్రమంలో లోకేష్ దాస్, శివకుమార్, తులసి స్వామి భజనలో పాల్గొన్నారు.