తుఫాను ప్రభావంతో వస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం నియోజకవర్గానికి చెందిన కార్వేటినగరం లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎటువంటి విపత్తు వచ్చినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.