చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ జూలై 27న అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ కె. జయప్రకాశ్ మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి రెడ్డి రాధాకి సోమవారం కార్పస్ ఫండ్ నుంచి రూ. లక్ష చెక్కును జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అందజేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఎస్పీ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.