ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం విజయవాడలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కృపా లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితుల గురించి వారు జగన్ కు వివరించారు. ఈ సందర్భంగా జగన్ వారితో మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు.