చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం ఎమ్మార్వో కార్యాలయాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్యాలయ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.