తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద అదనపు వీఐ బ్రహ్మానందం రాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.