చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సోమవారం చంద్రగిరిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోషియల్ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. లంచం తీసుకుని బ్రతకాల్సి వస్తే. చావడానికైనా సిద్ధమే కానీ, అవినీతికి పాల్పడనన్నారు. చెవిరెడ్డి 5ఏళ్లు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూనే ఉంటాడన్నారు. ఎప్పుడైనా నిరూపిస్తే టవర్ క్లాక్ దగ్గర కుటుంబంతో కలిసి క్షమాపణలు చెబుతానన్నారు.