తుఫాను ప్రభావంతో తిరుపతి రూరల్ మండలంలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. తిరుచానూరు, సి. మల్లవరం, గాంధీపురం పంచాయతీలలోని కొన్ని ప్రాంతాలు నీటి మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బుధవారం చంద్రగిరి ఎమ్మెల్యే నాని ఎమ్మార్వో, పోలీసు శాఖ, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. అధైర్యపడకండి అండగా ఉన్నామని ఎమ్మెల్యే ఆయా ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించారు.