రణస్థలం మండల కేంద్రమైన జే. ఆర్. పరంలో 16వ జాతీయ రహదారికి ఈ నెల 24న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 252. 42 కోట్ల రూపాయల వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ పనులకు ఎక్స్ లో పేర్కొన్న విషయంపై శుక్రవారం స్థానిక ప్రజలు ప్లై ఓవర్ వద్దంటూ నినాదాలు చేశారు. రణస్థలంలో ఈ ఫ్లై వోవర్ వేయడం వలన కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడతాయని ఉపాది కోల్పోవడమే కాకుండా స్తానిక ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు.