విద్యార్థినిల్లో ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడం కోసం ఎచ్చెర్ల లోగల డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం కరాటే శిక్షణా తరగతులను సోమవారం ప్రారంభించింది. మానసిక, ఆరోగ్యం విద్యార్థినిల్లో మరింతగా మెరుగు పరిచేందుకుద్దేశించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో మొదలయ్యాయి. విద్యార్థినిలకు కరాటే బోధకురాలు ఆర్. ఝాన్సీ శిక్షణా కార్యక్రమాన్ని లేడీస్ హాస్టల్స్ ఆవరణంలో నిర్వహించారు.