రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం ద్వారా స్ఫూర్తిని పొందుతామని ఆమదాలవలస జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి. శ్యామసుందర్ చెప్పారు. సోమవారం కళాశాల ఆవరణలో రాజ్యాంగ హక్కుల పరి రక్షణ వేదిక కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. వేదిక జిల్లా కన్వీనర్ వడ్డేపల్లి మోహనరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన జరుగుతున్న రాజ్యాంగ దినోత్సవాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ నిర్వహించాలని కోరారు.