దూసిపేటలో జరిగిన పల్లెపండుగ సందర్భంగా గ్రామంలో రహదారులు, కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కూన రవికుమార్ శంకుస్థాపన చేశారు. గురువారం ఆముదాలవలస మండలంలోని దూసిపేట ఎన్ఆర్ఈజీఎస్ పనుల కింద రూ.56.50 లక్షల నిధులతో పనులకు ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందని ఆయన అన్నారు.