టెక్కలి మండలం లింగాలవలస నుంచి రంగాపురం గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉండడంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అధికంగా కూరగాయలు పండడంతో జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు అమ్మకాలకు వెళ్లే సమయంలో గుంతల రహదారితో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు స్పందించి పక్కా రహదారిని నిర్మించాలని ఆదివారం గ్రామస్తులు కోరారు.