ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అమలు చేస్తున్న ప్రత్యేక ఫీజులను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి. హరీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కళాశాల ముందు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న విద్యా, వసతి దీవెన నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. ప్రత్యేక ఫీజులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.