పలాసలోని కాశిబుగ్గలో ఇద్దరి మైనర్ అమ్మాయిలపై జరిగిన అత్యాచారంపై ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బర్తే పార్టీ కోసం ఒక ప్రదేశానికి అమ్మాయిలతో పాటుగా వెళ్లారని, పార్టీలో అబ్బాయిలు మద్యం తాగి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు పంపామన్నారు.