ఎచ్చర్ల మండలంలోని జరజం గ్రామపంచాయతీలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి దుంగ దాలినాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కల నాటడం,ప్లాస్టిక్ నిర్మూలన,బహిరంగ మల విసర్జన,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛత హీ సేవ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.