వజ్రకరూరు మండలం చాబాల, ధర్మపురి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, టీడీపీ మండల కన్వినర్ నూతేటి వెంకటేష్ అన్నారు. చాబాల, ధర్మపురి గ్రామాల్లో, పల్లె పంచాయతీ వారోత్సవాలలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు, సర్పంచ్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.