అంటూ వ్యాధులు ప్రబలకుండా వ్యాధులపై అవగాహన పెంపొందించి తధనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన మలేరియా యూనిట్ అధికారి తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటూ, ఫోటోలకు మాత్రం ఫోజులిస్తున్నారని ఆరోపణలు సర్వత్రా వెళ్ళు వెత్తుతున్నాయి. ఉరవకొండ పట్టణంలో ఉన్న 10 వార్డు, పాత బస్టాండ్ దగ్గర ఉన్న ఎర్రి తాత దేవస్థానం, గవి మట పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. అయినా పట్టించుకునే వారే లేరని వాపోయారు స్థానికులు.