ఉరవకొండలో సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో నెట్టెం మధుసూదన్ నాయుడును ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ గా నియమించారు. సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్, బాల రంగయ్య, శ్రీనివాసులు హాజరయ్యారు. రాంభూపాల్ మాట్లాడుతూ, హంద్రీనీవా కాలువ వెడల్పుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త కమిటీలో ఏ. రంగారెడ్డి, ఎన్. మధుసూదన్, మురళి, రవికుమార్ వంటి సభ్యులను నియమించారు.