తాడిపత్రి మున్సిపాలిటీకి చెందిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 2012లో పురపాలక సంఘం ఇన్ఛార్జి కమిషనర్ గా ఉన్న డీఈ కె. జయభారత్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా 25. 09 ఎకరాల మున్సిపాలిటీ భూమిని ఓ వ్యక్తికి కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై విచారణ చేయడానికి మున్సిపల్ ఆర్డీ విశ్వనాథను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది.