జిల్లాలోని చెరువుల సామర్థ్యాన్ని అంచనా వేయడంపై అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుక్కరాయసముద్రంలోని అనంతసాగరం చెరువు మరువను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మంగళవారం సాయంత్రం బుక్కరాయ సముద్రం వద్దగల అనంతసాగరం చెరువులో మరువ పారే ప్రాంతాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు.