ధర్మవరం రెవిన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు తీసుకున్న మహేష్ బుధవారం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ను కలిశారు. అనంతపురం అరవింద నగర్ లోని పరిటాల సునీత నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ధర్మవరం రెవెన్యూ డివిజన్ కు సంబంధించి పలు ఎమ్మెల్యే తో ఆర్డీవో చర్చించారు.