పెనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి సవితమ్మ సూచనలు మేరకు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు టీడీపీ నాయకులు. మొదటగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సవితమ్మ భర్త వెంకటేశ్వరరావు, టిడిపి పెనుకొండ పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, రూరల్ మండల కన్వీనర్ సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.