శ్రీసత్యసాయి జిల్లా, అమరాపురం కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో శనివారం స్వయం సహాయక సంఘాల యానిమేటర్ల ప్రత్యేక సమావేశం మండల సమైక్య భవనంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోబ్యాంక్ మేనేజర్ బెహరా మాట్లాడుతూ.. పొదుపు సంఘాలకు విరివిగా రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. తీసుకున్న రుణాలకు సక్రమంగా తిరిగి చెల్లించాలని అన్నారు. అలాగే వడ్డి రేట్ల గురించి వివరించారు.