కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ధర్మవరం రోడ్డులో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్ ను సోమవారం మున్సిపల్ అధికారులు జేసీబీ సాయంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చి వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలన్నింటికి నోటీసులు ఇచ్చి కూల్చి వేస్తామని స్పష్టం చేశారు.