కదిరి పట్టణంలో ఒక మోస్తారు వర్షానికే రోడ్లు మొత్తం నదులను, కుంటలను తలపించేలా వర్షపు నీరు నిలుస్తోందని జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ కుటాల గురువారం పేర్కొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. పట్టణంలో వర్షపు నీరు మొత్తం దిగువ ప్రాంతం అనగా నల్లగుట్ట వీధి, కళ్ళంగడి వీధి, జోన్నా వీధి, వలీసాబ్ రోడ్డు, హిందూపురం క్రాస్, దేవళం బజార్ ప్రాంతాలకు చేరుకుంటుంది అన్నారు. దీంతో ఆయా కాలనీల్లో నివసించే ప్రజల కష్టాలు మాటల్లో చెప్పలేం అన్నారు.