రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర విజన్ -2047 అందరం కలిసి సహకారం చేద్దామని శుక్రవారం టిడిపి హిందూపురం పట్టణ అధ్యక్షుడు రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు శ్రీకంఠాపురం సత్యనారాయణపేట ప్రాంతాల్లో వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విజన్ -2047లో పట్టణానికి కావాల్సిన వసతులు గురించి సమస్యలను ప్రభుత్వానికి, అధికారులకు పంపవచ్చని తెలిపారు.