గుంతకల్లు పురపాలక సంఘంలోని 17వ వార్డు సచివాలయ పరిధిలో సోమవారం డ్రైనేజీ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మంగళవారం మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్ వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించి శానిటేషన్ సిబ్బందితో సమస్యను పరిష్కరించారు. అనంతరం వార్డులోని పలు సమస్యల గురించి ప్రజలకు ఆరా తీశారు. పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు