ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి జర్నలిస్టుల మధ్య వివాదం ముదురుతోంది. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ సభ్యులు మంగళవారం మాట్లాడుతూ. ధర్మవరం పట్టణంలో మున్సిపల్ కాంప్లెక్స్ నందు ధర్మవరం ప్రెస్ క్లబ్ పేరిట నిర్వహిస్తున్న సంస్థలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, ప్రెస్ క్లబ్ కు అనేకమంది దాతలు ఇచ్చిన వస్తువులకు, డబ్బులకు సరైన వివరాలు చూపాలని, లేని పక్షంలో కోర్టులో కేసు వేస్తామని అన్నారు.