అనంతపురం తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోందని టీబీ డ్యామ్ బోర్డు అధికారులు తెలిపారు. సోమవారం 10, 630 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి చేరుతోందని వివరించారు. ప్రస్తుతం జలాశయంలో 101. 773 టీఎంసీల నిల్వ ఉందన్నారు. 10, 032 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు.