నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి కొండ పోరంబోకు లో అక్రమంగా చెట్లు నరికివేత. సర్వేనెంబర్ 98లో నల్ల తుమ్మ, కలప నరికి అక్రమంగా తరలిస్తున్నారు. గతంలో అక్రమ తరలింపును తహసిల్దార్ అడ్డుకోవడంతో కొన్ని రోజులు అక్రమ తరలింపులు ఆపారు. అధికారుల మాటలు లెక్కచేయకుండా మరోసారి అక్రమంగా కలప ను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై ఉన్న అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.