నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల నాయకులు అందరూ కలిసి వరద బాధితుల సహాయార్థం 6 లక్షల 50 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. వింజమూరు మండలం బొమ్మరాజుచెరువు గ్రామంలో గల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు వరికుంటపాడు మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు చేతుల మీదుగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి అందజేసి, ఈ విరాళమును వరద బాధితులకు అందజేయాలని కోరారు.